పబ్లిక్ డోమైన్‌లోకి ‘కుల గణన’!
తెలంగాణ డేటాను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి : మంత్రి పొన్నం
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కులసర్వే(సీఫెక్)తో పాటు స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ నివేదిలను ప్రభు త్వం వెల్లడించింది. వీటి వివరాలను పబ్లిక్ డోమైన్‌లో పెడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
బుధవారం సచివాలయంలో మంత్రి వాకిటి శ్రీహ రి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ మహేష్‌కుమార్‌గౌడ్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి మంత్రి పొ న్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేపట్టడంతో ఎవరి జనాభా ఎంతో తేలిందన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి సమగ్ర సర్వే చేపట్టినట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 12లక్షల 36 వేల 849 కుటుంబాలను (97.10) శాతం సర్వే నిర్వహించినట్లు చెప్పారు. మొత్తం 3 కోట్ల 55 లక్షల 50 వేల 759 మంది జనాభా వివరాలను సేకరించినట్లు వివరించారు.






