16 April, 2026 | 2:00 AM

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

16-04-2026 12:35 AM

దోమకొండ, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో బుధవారం సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ నత్తి సంజీవులు, మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎన్‌ఆర్ ఈజీఎస్ నిధులు 20 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు.

అట్టి నిధుల ద్వారా గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో నిధులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ రవికుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, దోమకొండ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, గొట్టిముక్కల గ్రామ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు,, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.