18 April, 2026 | 11:06 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

దేశ వ్యాప్తంగా కులగణన చేయాలి

16-06-2025 01:38 AM

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 15: భారతదేశ జనాభా దామాషా ప్రకారం ఎవ్వరి జనాభా ఎంతో.. తక్షణమే కులగణన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి అన్నా రు. ఆదివారం కుంట్లూరు గ్రామ శాఖ మహాసభ అజ్మీరా హరిసింగ్ నాయక్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభకు ఆందోజు రవీంద్రచారి హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ జనాభా దామాషా ప్రకారం ఎవ్వరి జనాభా ఎంతో.. తక్షణమే కులగణన చేయాలన్నారు. భూర్జువా పార్టీలు ఏ రోజు కూడా పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలేదు.

కేవలం వారి ఓట్లు వేసే యాంత్రాలాగా ఉపయోగించుకుంటూ.. 78 ఏండ్లుగా పబ్బం గడిపాయి. రాష్టంలో అత్యధికంగా ఉన్న బీసీలకు 42% వాటా ఇవ్వాలని రాష్ట్ర కమిటీ చేసిన తీర్మాణాన్ని కేంద్రం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేదలను విద్య, వైద్యం పేరుతో కార్పొరేట్ సంస్థలు ప్రజల రక్తాన్ని పీడ్చుస్తున్నాయన్నారు. నిత్యావసర వస్తువు లు ధరలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయయాని దుయ్యబట్టారు. రావి నారాయణరెడ్డి ఫేస్3 లో నిరుపేదలు వేసుకున్న గుడిసెల స్థలంలో ఇందిరమ్మ ఇండ్లను సర్కారే నిర్మించి పేదలకు ఇవ్వాలన్నారు.

వంద ఏళ్ళు పూర్తి చేసుకున్న సీపీఐ పార్టీ తరుఫున ప్రతి ఒక్కరు ప్రజా స మస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.  కార్యదర్శిగా బానోత్ బిచ్చునాయక్, సహాయ కార్యదర్శులుగా రాంరెడ్డి, సామ కొండల్ రెడ్డి ఎన్నుకోగా.. సభ్యులుగా పద్మ, లక్ష్మమ్మ, రమేష్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, అజ్మీరా హరిసింగ్ నాయక్, మండల నాయకులు చిర్ర శేఖర్, గణేష్, పేరాల గోపి, సైదులు, అనసూయ, రాజు, రవళి తదితరులుపాల్గొన్నారు.