01-05-2025 01:41:04 AM
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జన గణనతో పాటు కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ. హనుమంతరావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ కు తలొగ్గే కేంద్రం కులగణన చేసేందుకు నిర్ణయం తీసుకుం దన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో 90 శాతం ఉన్న పేద వర్గాలకు వనరుల్లో, సంపదలో వాటా దక్కాలన్న రాహుల్ డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదన్నారు.