calender_icon.png 1 May, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న మంత్రి

01-05-2025 01:38:54 AM

 మంథని ఏప్రిల్ 29 (విజయక్రాంతి): రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని తన వాహనాలు ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు.

మంథని నియోజకవర్గం లోని మహదేవ్ పూర్  నుండి కాటారం వెళ్తుండగా మార్గమధ్యలో బొమ్మాపూర్ క్రాస్ వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో అటువైపు వెళ్తున్న మంత్రి  గాయలైన వారిని గమనించి తన వాహనాన్ని ఆపి, విషయం తెలుసుకొని వెంటనే వారిని  తన స్కార్పియో ప్రత్యేక వాహనంలో హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఆస్పత్రి వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని శ్రీధర్ బాబు వైద్యులను కోరారు. దీంతో గాయపడ్డ వారు ప్రజలు మంత్రిని అభినందించారు.