19-08-2025 01:44:26 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలోని అన్ని కుల వృత్తుల సభ్యులు మద్దతు తెలిపినట్టు జిల్లా ఉద్యమ కారుల సంఘం అధ్యక్షుడు బట్టు బుమేష్ మంగళవారం తెలిపారు. స్వర్ణకార సంఘ నాయకులు మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఉద్యమానికి మద్దతుగా మండల కేంద్రంలో నంది విగ్రహం ఎదుట ప్లాకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.