19-08-2025 01:46:10 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు(In-charge Chalmeda Lakshmi Narasimha Rao) విత్తన గణపతి అందజేశారు. వినాయక చవితి సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా విత్తన గణపతినీ వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, హరిత సేన వేములవాడ సభ్యులు కమల్ గౌడ్, కిరణ్, సందీప్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.