calender_icon.png 23 January, 2026 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపై జాగ్రత్తే కార్మికుడి ప్రాణ రక్షణ

23-01-2026 08:28:51 PM

➤  రోడ్డు భద్రతపై కార్మికులకు, అవగాహన కల్పించిన

➤   రోడ్డు భద్రత వారోత్సవాల్లో ‘ అలైవ్–అరైవ్’కార్యక్రమం 8వ రోజు అవగాహన

➤  ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి

మనోహరాబాద్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు ఒక్క కుటుంబానికే కాదు సమాజానికే తీరని నష్టం కలిగిస్తాయని రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "అరైవ్-అలైవ్" కార్యక్రమంలో భాగంగా 8వ రోజు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన పరిశ్రమల ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో చిన్న నిర్లక్ష్యం ప్రమాదాలకు దారి తీస్తుందని అన్నారు.

వాహనాలను వేగంగా నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంలో నిర్లక్ష్యం వంటి కారణాల వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. కార్మికులు విధులు ముగించుకుని సురక్షితంగా ఇంటికి చేరడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు. అరైవ్ -అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడమే లక్ష్యంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అదనపు ఎస్పి.

ఉద్యోగం ఎంత ముఖ్యమో ఆ ఉద్యోగి ప్రాణం అంతకన్నా విలువైనది. వేగం కాదు జీవితం గెలవాలని అన్నారు. మనోరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటిసి కంపెనీలో రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ శుక్రవారం మెదక్ జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశానుసారం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటిసి కంపెనీలో భారీ ఎత్తున రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్య అతిథులుగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 


ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మోటార్ సైకిళ్ల ద్వారానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటే మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. అందువల్ల రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చిన్న వయస్సు నుంచే బాధ్యతగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ఐఎస్‌ఐ మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే విని యోగించాలని, హెల్మెట్ స్ట్రాప్‌ను తప్పనిసరిగా పెట్టు కోవాలని తెలిపారు.

హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకోనట్లయితే హెల్మెట్‌కు ఎలాంటి రక్షణ ప్రయోజనం ఉండదని చెప్పారు. అలాగే సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, వేగ నియంత్రణ పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని, తమ తల్లిదండ్రులు బయటకు వెళ్లే సమయంలో కచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించాలన్నారు. చివరగా రోడ్డు భద్రత పై కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డిఎస్పి జె. నరేందర్ గౌడ్, తూప్రాన్ సీఐ రంగకృష్ణ, మనోహరాబాద్ ఎస్సై బి సుభాష్ గౌడ్, ఆనంద్ జాడి, ఫ్యాక్టరీ మేనేజర్ శివం కల్రా, హెచ్ ఆర్. మేనేజర్ నరసింహం, అడ్మిన్ మేనేజర్ సాగి సూర్య, సేఫ్టీ మేనేజర్ ఐ టి సి యాజమాన్యం కార్మికులు పాల్గొన్నారు.