23-01-2026 08:25:53 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): పని దొరకటం లేదని... ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతూ మనస్థాపం చెందిన పెయింటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాప్రాల్ పరిధిలోని వాంబే క్వాటర్స్ లో చోటుచేసుకుంది. అక్షయ్(23) తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. అక్షయ్ పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగించేవాడు.
ఇటీవల పని సరిగ్గా దొరకకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్ళిన తరువాత ఒంటరిగా ఉన్న అక్షయ్ మనస్థాపం చెంది టెర్రస్ పైన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.