23-01-2026 08:30:57 PM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట,(విజయక్రాంతి): గ్రామస్థాయిలో ప్రజల సంక్షేమం కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నారాయణపేట స్కిల్ డెవలప్మెంట్ సింగారం ట్రైనింగ్ సెంటర్లో నూతన సర్పంచ్ లకు నిర్వహిస్తున్న తొలి దశ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తొలి దశలో 5 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణలో వివిధ మండలాలకు చెందిన సర్పంచ్ లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ గ్రామీణాభివృద్ధి శిక్షణా సంస్థ వారు రూపొందించిన కరదీపికలోని అన్ని అంశాలపై సుశిక్షితులైన మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ అందించడం జరిగిందని, సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. సర్పంచ్ లు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వినియోగించాలని తెలిపారు. అనంతరం శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సుధాకర్ రెడ్డి, DRDA మొగులప్ప MPDO లు సర్పంచ్ లు జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.