25 August, 2026 | 2:58 AM

నాగోల్‌లో 74 సీసీ కెమెరాలు ప్రారంభం

25-08-2026 12:00 AM

‘నేను సైతం 2.0’లో భాగంగా ఏర్పాటు

నాగోల్, ఆగస్టు 24 (విజయక్రాంతి): నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం చేపట్టిన ‘నేను సైతం 2.0’ కార్యక్రమంలో భాగంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 74 సీసీటీవీ కెమెరాలను ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ బి. శ్రీనివాసులు, నాగోల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ బుధవారం ప్రారంభించారు.

కృషినగర్లోని పల్లవి డీబీఆర్ అపార్ట్మెంట్స్లో 30, రాఘవేంద్రనగర్ కాలనీ, తట్టి అన్నారం డబుల్ బెడ్రూమ్, అన్నవరపు సత్యనారాయణ కాలనీల్లో 44 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, ప్రజల భద్రతకు దోహదపడుతున్నాయని తెలిపారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 2,58,457 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎల్బీనగర్ జోన్లో 81,183 కెమెరాలు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ బి. నవీన్రెడ్డి, ఎస్‌ఐలు పి. శివనాగ ప్రసాద్, ఉమ, ఆయా కాలనీల ప్రతినిధులు, అపార్ట్మెంట్ వాసులు డాక్టర్ విష్ణు, శ్రీనివాస్, వెంకట్రెడ్డి, శ్రీరాములు, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.