16-09-2025 01:41:06 PM
న్యూఢిల్లీ: దేశం నుండి మాదకద్రవ్యాలను తుడిచిపెట్టడానికి మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదకద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్(ANTF) అధిపతుల 2వ జాతీయ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. 2047లో గొప్ప భారతదేశాన్ని నిర్మించాలనే భావనను ప్రధాని మోదీ అందించారని.. మనం అలాంటి భారతదేశాన్ని నిర్మించాలనుకుంటే, మన యువ తరాన్ని మాదకద్రవ్యాల నుండి రక్షించడం చాలా ముఖ్యం అని తెలిపారు. మన భవిష్యత్ తరాలు బోలుగా మారితే, దేశం దారితప్పిపోతుంది... దురదృష్టవశాత్తు, ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాలు సరఫరా చేయబడే రెండు ప్రాంతాలు మనకు దగ్గరగా ఉన్నాయి... కాబట్టి మనం దానికి వ్యతిరేకంగా బలంగా పోరాడాల్సిన సమయం ఇది.." అని పేర్కొన్నారు.
"మూడు రకాల కార్టెల్ లు ఉన్నాయి, ఒకటి దేశంలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద పనిచేసే కార్టెల్, రెండవది ఎంట్రీ పాయింట్ నుండి రాష్ట్రానికి పంపిణీ చేసే కార్టెల్, మూడవది పాన్ షాప్ లేదా డ్రగ్స్ అమ్మే వీధి మూల వరకు రాష్ట్రాలలో పనిచేసే కార్టెల్ అని.. కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఈ మూడు రకాల కార్టెల్ లకు దెబ్బ గట్టిగా ఇవ్వలని.. ఇక్కడ కూర్చున్న ప్రజలు ఈ పోరాటం మా పోరాటం అని నిర్ణయించుకున్నప్పుడే ఇది జరుగుతుందని నేను నమ్ముతున్నానని పేర్కొన్నారు.
పారిపోయిన వ్యక్తుల బహిష్కరణ, అప్పగింత.. ఈ రెండూ చాలా ముఖ్యమైనవి. విదేశాలలో కూర్చుని ఇక్కడ మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్న వ్యక్తులను మన చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీబీఐ ఇందులో చాలా మంచి పని చేసింది.. అన్ని A&TF అధ్యక్షులు సీబీఐ డైరెక్టర్ ను సంప్రదించి, మాదకద్రవ్యాలు, ఉగ్రవాదం, ముఠాలకు మాత్రమే కాకుండా మిగతా అన్నింటికీ ఉపయోగపడే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తాను అభ్యర్థిస్తున్నానని అన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పగించడం ఎంత అవసరమో, ఆచరణాత్మక విధానంతో బహిష్కరణ చేయడం కూడా అంతే అవసరం అని.. ఇక్కడ జైలులో ఉంచిన వారు ఏదో ఒక విధంగా ఇక్కడి నుండి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని.. హోం మంత్రిత్వ శాఖ కొంత మార్గదర్శకత్వం ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియ పట్ల ఉదారవాద విధానాన్ని తీసుకోవాలి.. ఏర్పాటు కోసం ఒక మార్గాన్ని నిర్ధారించాలి.. వారిని బహిష్కరించడం కోసం హోం శాఖ దీని కోసం ఒక ఎస్ఓపీ(SOP) కూడా జారీ చేయబోతోందని అన్నారు.