11-11-2025 01:09:29 AM
* వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి శేషారెడ్డి
రేగోడు, నవంబర్ 10: మండలంలోని లింగంపల్లి శివారులో శ్రీ లక్ష్మీ నరసింహ సీసీఐ జిన్నింగ్ మిల్లును సోమవారం వట్టిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి శేషారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ మండలంలోని పత్తి పండించిన రైతులందరూ జిన్నింగ్ మిల్లును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సునీల్, సిసిఐ సెంటర్ అధికారి రజిక్, శ్రీ లక్ష్మీనరసిం హ జిన్నింగ్ మిల్ నిర్వాకులు సంతోష్ రెడ్డి, వట్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.