calender_icon.png 11 November, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు పక్క రాష్ట్రాల ధాన్యం!

11-11-2025 01:06:59 AM

  1. రూ.500 బోనస్ కోసం అక్రమంగా తరలిస్తున్న వైనం
  2. సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయని సివిల్ సప్లయ్ శాఖ 
  3. అధికారులు, సిబ్బంది చేతివాటం?
  4. లోపించిన నిఘాతో ఏపీ, కర్ణాటక నుంచి ధాన్యం లారీల ఎంట్రీ!
  5. రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం 

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యం రాష్ట్ర అన్న దాతకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇతర రాష్ట్రా ల నుంచి ధాన్యం రాకుండా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహారిస్తుం డటంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా తరలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకుంటామన్న సివిల్ సప్లయ్ శాఖ అధికారుల నీటి మూటలుగానే మిగిలాయి.

దీంతో తాజాగా కర్ణాటక నుంచి ధాన్యం లోడుతో వచ్చిన లారీ పట్టుబడింది. ఈ వానాకాలం సీజన్‌లో 65.96 లక్షల ఎకరాల్లో వరి సాగయిందని, 159.15 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ప్రభుత్వం సివిల్ సప్లు శాఖ ద్వారా 75 లక్షల టన్నులు సేకరించాలని నిర్ణయం తీసుకున్నది. అందులోనూ 53 లక్షల టన్నులు ఎఫ్‌సీఐ ద్వారా మద్దతు ధర ఏ గ్రేడ్‌కు రూ.2.389, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,369 చొప్పున కొనుగోలు చేయ డానికి కేంద్రం అనుమతిచ్చింది.

రాష్ట్ర ప్రభు త్వం సన్న ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా మరో రూ.500 బోనస్ అందిస్తోంది. దీంతో రాష్ట్రంలో మద్దతు ధర ఎక్కువగా ఉండటం, కొనుగోళ్లు సైతం వేగవంతం కావడంతో పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం ఏటా రాష్ట్రానికి వస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ పూర్తవుతుండటంతో.. తెలంగాణ రైతులు ధాన్యం అమ్మకాలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

కర్ణాటక లారీని పట్టుకుని వదిలేసిన అధికారులు

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యానికి అడ్టుకట్ట వేస్తామని, అందుకు రాష్ట్రంలోని 17 జిల్లాలోని 56 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తామని సివిల్ సప్లు శాఖ అధికారులు గతంలోనే ప్రకటించారు. చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలతో పాటు సర్వేలెన్స్ ఏర్పాటు చేస్తామని, అకస్మిక తనిఖీలు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్రిక ల్చర్, మార్కెటింగ్, కో ఆపరేటివ్, పోలీ సు శాఖల సమన్వయంతో ధాన్యం సేకరణ ప్రక్రి య సజావుగా సాగేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

అయితే కర్ణాటక నుంచి ధాన్యం యథేచ్చగా వస్తుందని సమాచారం. కర్ణాటక లారీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చూసిచూడనట్లుగా వది లేస్తు న్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంత మైన కృషెే్ణవాసునగర్ చెక్‌పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి ఏడు ధాన్యం లారీలు రాగా, కేవలం ఒక్క లారీని మాత్రమే మాగనూరు పోలీసులు నల్లగట్టు సమీపం లో పట్టుకుని స్టేషన్‌కు తరలించి, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం అందిం చారు. అధికారులు శుక్రవారం ధాన్యం లోడును పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోకుండానే కర్ణాటకకు పంపించారు.

పర్యవేక్షణా లోపం.. సిబ్బంది చేతివాటం!

రవాణా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం గా గతంలో 15 చెక్‌పోస్టులు ఉండేవి. వాటిని ప్రభుత్వం తొలగించడంతో సివిల్ సప్లయ్ శాఖ ఇంటర్‌స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఈ చెక్‌పోస్టుల్లో సిబ్బంది పర్యవేక్షణ లోపించడం, కొన్ని చెక్‌పోస్టుల్లో సిబ్బం ది చేతివాటం ప్రదర్శించడంతోనే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ధాన్యం వస్తున్నట్లు సమాచారం. నిత్యం చెక్‌పోస్టులపై మానిటరింగ్ చేయాల్సిన ఉన్నతా ధికారుల పర్యవేక్షణ లోపిం చిందని, ఎన్‌ఫోర్స్‌మెంట్  అధికారులు సైతం చోద్యం కార ణంగానే ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యం తెలంగాణకు వస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వాడపల్లి మీదుగా ఏపీ నుంచి తరలింపు

యాసంగి సీజన్‌లో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి అంతర్రాష్ట చెక్‌పోస్టు వద్ద ఏపీ నుంచి వచ్చిన ఏడు లారీలను అధికారులు సీజ్ చేశారు. ఏపీ ధాన్యాన్ని తెలంగాణలో అక్రమంగా విక్రియస్తున్న దళారు లపై వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేశా రు. వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద ఇంటిగ్రేటేడ్ చెక్ పోస్టులను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. అయినా ఏపీ నుంచి వాడపల్లి చెక్‌పోస్టు మీదుగా మిర్యాలగూడకు ధాన్యం రాగా, వాటిని తిప్పి పంపించారు. ఈ వానాకాల సీజన్‌లో కూడా పునరావృతం అవుతున్నట్లు సమాచారం.