గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి : ఎస్‌ఐ అశోక్ బాబు
మాగనూరు. మార్చి. 5; గ్రామాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మాగనూరు ఎస్త్స్ర అశోక్ బాబు అన్నారు. గురువారం మాగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల సర్పంచులకు, ఉప సర్పంచ్లకు, గ్రామ పెద్దలకు, యువకులకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర మాట్లాడుతూ గ్రామాల్లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాలు వల్ల నేరాలను ముందుగానే గుర్తించడం, నేరస్తులను త్వరగా పట్టుకోవడం సులభం అవుతుందని వారు తెలిపారు.
గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సర్పంచులు గ్రామ పెద్దల పాత్ర కీలకమని, గ్రామానికి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా అనుమాదాస్పదముగా తిరిగే వ్యక్తుల వివరాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని అన్నారు. ఇటీవల దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో గ్రామాల్లోని దేవాలయాల వద్ద ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని వారు కోరారు గ్రామ ప్రజలు పోలీసు శాఖకు సహకరిస్తూ గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడాలని ఎస్‌ఐ అశోక్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు ఉపసర్పచ్చులు గ్రామ పెద్దలు యువకులు పోలీస్ సిబ్బంది తదితరు పాల్గొన్నారు.




