calender_icon.png 16 January, 2026 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సీడీఎంఏ అధికారుల పరిశీలన

15-01-2026 12:01:53 AM

మొయినాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): సీడీఎంఏ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పాల్గున్, డిప్యూటీ డైరెక్టర్ సాయినాథ్, మున్సిపల్ చైర్మన్ కాజా మొహినుద్దీన్లు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా ఎలక్టోరల్ రోల్స్ ప్రిపరేషన్, వార్డుల ప్రకారం ఫోటో ఎలక్టోరల్ రోల్స్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ మరియు ఫైనల్ పబ్లికేషన్, పోలింగ్ స్టేషన్ల ఎంపిక మరియు డ్రాఫ్ట్ పబ్లికేషన్, పోలింగ్ స్టేషన్లను నార్మల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్గా వర్గీకరించి వెరిఫికేషన్, ఆన్లైన్ ఎలక్టోరల్ రోల్స్ మరియు పోలింగ్ స్టేషన్ మ్యాపింగ్ అంశాలపై వెరిఫికేషన్ చేపట్టారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సంబంధిత వివరాలను పరిశీలించిన అనంతరం అజీజ్ నగర్ హై స్కూల్లోని పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. అలాగే ఎంఏకే కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ను కూడా పరిశీలించారు.