15-01-2026 12:04:08 AM
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇంట బసవన్నల సందడి..
షాద్‌నగర్, జనవరి 14, (విజయక్రాంతి): మన అచ్చ తెలుగు దనాన్ని ఆవిష్కరించే అందమైన పండుగ సంక్రాంతి అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డూడూ బసవన్న ఆయన ఇంటి ముందు ప్రదక్షణలు చేసి మేళ తాళాలతో పండగ వాతావరణాన్ని ఇంటి ముందు పరిచారు.అయ్యగారికి దండం పెట్టు.. చల్లంగా దీవించు.. విజయాలను అందించు.. ఏడాది మొత్తం వారి కుటుంబంలో చిరునవ్వులు చిందించు వరాలను అందించు.. అంటూ గంగిరెద్దుల సాయన్నలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇంటి ముందు సందడి చేశారు.
సంక్రాంతి సంబరాలలో భాగంగా బసవన్న ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన మాట్లాడుతూ నేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఆనందాలు పంచే ఈ సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు కార్యకర్తలు ఆయనకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఘట్‌కేసర్..
ఘట్‌కేసర్, జనవరి 14 (విజయక్రాంతి): సంక్రాంతి పండగను ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంత ప్రజలు అత్యంత వైభవంగా ఉత్సాహ భరితంగా జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఈ పండుగను మూడు రోజులుగా జరుపుకుంటుoడగా మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ పండుగ పేర్లతో జరుపుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేసి అందంగా గొబ్బెమ్మలను చేర్చి పోటాపోటీగా మహిళలు ముగ్గులు వేయడంతో పల్లెలు కొత్త అందాలను సంచరించు కున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుకుతెచ్చే విధంగా ఈ సంక్రాంతి పండగ అందరిలోనూ నూతనోత్సవాన్ని నింపుతుంది.
నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండగ కావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఈ సంక్రాంతి పండగ ప్రత్యేకతను సంచరించుకుంటుంది. సంక్రాంతి సందర్భంగా పిల్లలు, యువకులు కేరింతలు కొడుతూ గాలిపటాలను ఎగురవేయగా బాలికలు, మహిళలు ముగ్గులు వేయడంలో పోటీపడ్డారు. సర్కిల్ ప్రాంతాలలోని దేవాలయాలలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు, ఒకరికి మరొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి పండగను ప్రజలు జరుపుకుంటున్నారు.