calender_icon.png 22 July, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 శాతం సీలింగ్ రిజర్వేషన్ ఎత్తివేయాలని..

22-07-2025 04:54:31 PM

- లక్ష సంతకాల సేకరణ 

హాజీపూర్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లకై రాజ్యాంగ సవరణ చేసి, బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలలో, చట్టసభలలో 50 శాతం సీలింగ్ రిజర్వేషన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని హాజీపూర్ మండలం(Hajipur Mandal)లో మంగళవారం ప్రారంభించారు. హాజీపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీసీ రిజర్వేషన్ లకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. లేని పక్షంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు గజెల్లి వెంకటయ్య, శాఖపురి భీమ్సేన్, షేక్ సల్మాన్, నితీష్, లక్ష్మణ్  తదితరులు పాల్గొన్నారు.