22-07-2025 11:22:33 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): పీడిత ప్రజల గొంతుకగా జీవించిన దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా మంగళవారం బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దిండిగల రాజేందర్ మాట్లాడుతూ.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని వెలుగెత్తి చాటి చెప్పిన మహాకవి దాశరథని కొనియాడారు. కవిగా రచయితగా తన రచనలతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షర యుద్ధం సాగించి దిక్కారస్వరం వినిపించిన వైతాళికుడు కృష్ణమాచార్యులని అన్నారు.
అంతటి మహాకవిని బిఆర్ఎస్ ప్రభుత్వం సముచిత గౌరవమిచ్చి సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతి రోజును అధికారికంగా నిర్వహించిన ఘనత బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ దేనన్నారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డ్ మాజీ కౌన్సిలర్ జేకే శ్రీను, టీబిజీకేఎస్ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు రంగనాథ్, నాయకులు మహమ్మద్ జాఫర్ హుస్సేన్, అబ్దుల్ నబి, జబ్బర్, వీరస్వామి, గిన్నారపు రాజేష్, సత్తాల హరీ కృష్ణ, కాసాని హరిప్రసాద్, కటకం పద్మావతి, సన రాజేష్, మునుగంటి, శివ, లలిత్ కుమార్ పాసి, చాంద్ పాషా, నిఖిల్, రమేష్, రామ్ లాల్ పాసి, కిషన్ పాసి, రవికాంత్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.