calender_icon.png 23 July, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి ముందు మురుగు నీళ్లు

22-07-2025 11:41:00 PM

కోయిలకొండ: మండలం నల్లవల్లి గ్రామం ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ముందు వర్షపు నీరు నిలిచి మురుగు కుంటగా నిల్వ ఉండిపోతున్నాయి. ఈ మురికి నీళ్ల వల్ల దోమలు ఈగలు వృద్ధి చెందుతుంది. వాటి దగ్గరనే విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు. వర్షాకాలం ఉన్నందున మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, మొదలైన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పాఠశాల ముందు మురికి నీరు నిలవకుండా చేయాలని గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ప్రాథమిక పాఠశాల ముందు నీరు నిలువ లేకుండా చేయాలని పలువురు కోరుతున్నారు.