22-07-2025 11:26:09 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్(ADA Babu Nayak) అన్నారు. రాయపోల్ మండల కేంద్రంలో నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నానో యూరియా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. వ్యవసాయ రంగం నుంచి వచ్చే హరిత గృహ వాయువుల ఉద్గారాలు తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, జిల్లా ఇపికో ప్రతినిధి చంద్రబాబు నాయుడు, ఏఈవోలు పాల్గొన్నారు...