22-07-2025 11:19:30 PM
చివ్వేంల: మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ ప్రకాష్(Tahsildar Prakash) మాట్లాడుతూ... రాబోయే మూడు నెలల కాలంలో మండలంలో ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా మండల స్థాయి ప్రణాళికను రూపొందించటం జరిగింది. ప్రతి గ్రామంలో చెరువులు ఎంతవరకు నిండినవో చూసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విదంగా ప్రతి గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, అగ్రికల్చర్ ఆఫీసర్, డాక్టర్స్, ఎఈలు, హెడ్ కానిస్టేబుల్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.