calender_icon.png 23 July, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన పేదలకు శాశ్వత పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

22-07-2025 11:11:07 PM

చివ్వేంల: అర్హులైన ప్రతి పేదవాడికి ఎంక్వయిరీ చేసి శాశ్వత పట్టాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని కోరుతూ చివ్వేంల ఎమ్మార్వో ప్రకాష్(MRO Prakash)కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ... గత ఆరు సంవత్సరాల నుంచి చివ్వేంల మండలం కుడకుడ శివారు సర్వేనెంబర్ 126 ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు వారికి శాశ్వత పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి పార్టీ ఆధ్వర్యంలో అనేకమార్లు జిల్లా కలెక్టర్ కి సంబంధిత మంత్రులకు విజ్ఞప్తి చేయగా గత నెల 27 తారీకు ఎంక్వయిరీ చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయమని జిల్లా కలెక్టర్ ఎమ్మార్వోకి ఆదేశాలు జారీ చేశారు కానీ ఈరోజు వరకు రాలేదు అందులో భాగంగానే ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో గుడిసె వాసులతో చివ్వేముల ఎమ్మార్వోని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

దీనికి వారు సానుకూలంగా స్పందించి 10 రోజుల్లో ఎంక్వయిరీ చేసి  అర్హులైన వారిని గుర్తించి శాశ్వత పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్, ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకులు పేర్ల నాగన్న, టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నరసన్న, టి యు సి ఐ జిల్లా నాయకులు ఎస్కే గులాం, జానయ్య, పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ, పి ఓ డబ్ల్యు ఉపాధ్యక్షులు జయమ్మ,జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.