22-07-2025 11:24:39 PM
అడిషనల్ డిసిపి భీమ్రావు..
హుజురాబాద్ (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఫిర్యాదుదారులను మర్యాదగా పలకరించాలని అడిషనల్ డిసిపి భీమ్రావు(Additional DCP Bheem Rao) స్టేషన్ సిబ్బందికి సూచించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పోలీస్ స్టేషన్ను మంగళవారం అడిషనల్ డీసీపీ భీమ్రావు అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లోని వాహనాలు, ప్రాపర్టీలను, రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారి సమస్యలకు న్యాయం జరిగేటట్లు చూడాలన్నారు. అనుమానితులు, రౌడీ షీటర్ల పైనిఘా పెట్టాలని సూచించారు. ఆయన వెంట హుజరాబాద్ పట్టణ సీఐ కరుణాకర్, రూరల్ సిఐ పులి వెంకట్,ఎస్సైలు యూనస్ అహ్మద్ అలీ, డి రాధా కిషన్ తో పాటు సిబ్బంది ఉన్నారు.