22-07-2025 11:37:23 PM
రాజాపూర్: మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో మంగళవారం గ్రామ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాల(Pochamma Bonalu) వేడుకలు జరుపుకున్నారు. పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా గ్రామ పుర వీధుల్లో వేప తోరణాలతో, పోచమ్మ దేవాలయంలో పచ్చని పందిరి వేసి సుందరంగా ముస్తాబు చేశారు. మహిళలు అమ్మవారికి మట్టి కుండలో ప్రత్యేకమైన వంటకం చేశారు. అనంతరం బోనాలు డప్పు చప్పుళ్లతో, శివసత్తుల నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి బోనం, కొబ్బేరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.