04-01-2026 04:20:30 PM
నిర్మల్,(విజయక్రాంతి): సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 18న నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఉత్సవాల కరపత్రాలు విడుదల చేశారు బడుగు బలహీన పేద వర్గాల అభివృద్ధి కోసం సిపిఐ ఎంఎల్ పార్టీ అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిందని ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంత చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ ఎన్ రెడ్డి భీమ్ రెడ్డి బుక్కే రమేష్ పాల్గొన్నారు