calender_icon.png 12 August, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి వైఫల్యంతోనే పేదలకు దక్కని ఇండ్లు

12-08-2025 04:56:19 PM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డి(Former Minister Indrakaran Reddy) వైఫల్యంతోనే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందలేదని బిజెపి నేతలు ఆరోపించారు. మంగళవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ నేత ఇంద్రకరణ్ రెడ్డి చేపట్టిన ధర్నాపై బిజెపి నేతలు మండిపడ్డారు. అధికార పార్టీలో ఉండి ఇంద్రకరణ్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటు అని దీన్ని బిజెపిపై రుద్దడం సరికాదన్నారు. డబుల్ బెడ్ రూమ్ సముదాయ భవనాలను సందర్శించి త్వరలో ఎమ్మెల్యే సహకారంతో లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాధన అరవింద్ రమణారెడ్డి పార్టీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.