calender_icon.png 31 December, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి

31-12-2025 02:15:40 PM

  1. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31 న విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.
  2. డీజేలు,అధిక శబ్దం వచ్చే బాక్స్ లు వినియోగిస్తే ఉపేక్షించేది లేదు ..
  3. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు 
  4. వనపర్తి డిఎస్పీవెంకటేశ్వరరావు

వనపర్తి,(విజయక్రాంతి) : సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వనపర్తి డిఎస్పీ  వెంకటేశ్వరరావు(DSP Venkateswara Rao) జిల్లా ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో వేడుకలను జరుపుకోవాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరుపున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. బుధవారం ( డిసెంబర్ 31 ) జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనీఖీలు నిర్వహించబడుతాయని,నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ఎర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలు అయిన సరే నిర్వహకులు తప్పనిసరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలని,అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా డిజేలు,అధిక శబ్దం వచ్చే బాక్స్ లు ఏర్పాటు చేస్తే  ఉపేక్షించేది లేదని,తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఫోటోలు,మెసేజ్ లు పంపుతూ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదును కాజేయాలని కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారని తెలియని వ్యక్తుల వద్ద నుంచి మెసేజ్ లు వస్తే ఓపెన్ చేయొద్దని డిఎస్పీ సూచించారు.

పోలీసుల  సూచనలు, నిబంధనలు

డిసెంబర్ 31వ తేదీన టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు,అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 31వ తేదీన జిల్లా వ్యాప్తంగా డీజే లు నిషేధం.నిబంధనలు విరుద్ధంగా వినియోగిస్తే సీజ్ చేసి,కేసులు నమోదు చేస్తాం. మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం.వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించబడుతుంది. ప్రభుత్వ,ప్రవేట్ ఆస్తులపై,రాళ్లు వేయడం,అద్దాలను పగలగొట్టడం,మహిళలను ఇబ్బంది పెట్టిన,అసభ్యంగా ప్రవర్తించిన,అట్టి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. మైనర్ డ్రైవింగ్,ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్దకాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు ,న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్,గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు,  మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో మూసివేయాలి. మైనర్లకు మద్యం అమ్మకూడదు.  బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదం చోటు చేసుకుంటే  వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తాం.

 పై ఆంక్షలను ఎవరైన అతిక్రమించినా,ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి  వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, ఈ వేడుకలను ప్రజలు,యువత  తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుందన్నారు.అదేవిధంగా 2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ,జిల్లా ప్రజలందరికీ  పోలీస్ శాఖ తరపున డిఎస్పీ  వెంకటేశ్వరరావు  నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు