calender_icon.png 31 December, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సంవత్సరం వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి: కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి

31-12-2025 03:01:40 PM

కోదాడ: కొత్త సంవత్సరం 2026 వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని కోదాడ డి.ఎస్పి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు సూచించారు .మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్లు, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాత్రి 9 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు సాధ్యమని పేర్కొన్నారు.గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు వుంటాయన్నారు. స్నేహపూర్వక వాతావరణం లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.న్యూ ఇయర్ పార్టీ ఎవరి జీవితాల్లో, కుటుంబాల్లో విషాదం మిగల్చరాదు అని ఆకాంక్షిస్తున్నామని కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.