calender_icon.png 31 December, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పై రైతులకు అవగాహన

31-12-2025 03:12:53 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలములోనీ మాల్తుమ్మెద గ్రామంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌పై రైతులకు అవగాహన సమావేశం గ్రామీణ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, మట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్  పథకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు బుధవారం రైతుల అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో రసాయన ఎరువులు,పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సహజ వనరుల ఆధారిత వ్యవసాయం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ముఖ్యంగా సహజ వ్యవసాయ విధానాలు,జీవామృతం మరియు ఘనజీవామృతం తయారీ విధానాలు, దేశీ ఆవుల ప్రాముఖ్యత, మట్టిలో సూక్ష్మజీవుల పాత్ర, పంట వ్యయాలు తగ్గించి లాభాలు పెంచుకునే మార్గాలు వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... రసాయన ఎరువులు వాడటం మొదలుపెట్టిన రోజులలో వచ్చిన పంట దిగుబడికి ప్రస్తుతం వచ్చే పంట దిగుబడికి వ్యత్యాసం చాలా  ఎక్కువగా ఉందని దీనికి గల ముఖ్య కారణం పంట భూములు రసానిక ఎరువుల వలన కాలుష్యం అవడం, కావున ప్రతి రైతు రసాయనిక ఎరువుల వాడకాని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లాలని సూచించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రైతులు పంట వ్యర్ధాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలని రైతులకు సూచించడం జరిగింది. సహజ వ్యవసాయం ద్వారా రైతులు తక్కువ వ్యయంతో స్థిరమైన ఆదాయం సాధించవచ్చని,అలాగే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన మట్టిని అందించవచ్చని తెలిపారు.