31-12-2025 02:59:03 PM
వేగవంతంగా కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని ఎల్లయ్య చెరువు ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 13వ వార్డు టీచర్స్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ యువ నాయకుడు మహమ్మద్ గౌస్ పనులను ఎప్పటికప్పుడు దగ్గరుండి చేపించడం జరుగుతుంది. ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు జాప్యం జరగకుండా చెరువు కట్ట మరమ్మతులతోపాటు చెరువు కట్ట పరిసర ప్రాంతాలను శుభ్రపరచడం జరుగుతుంది. ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్రెడ్డి ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు చెరువు కట్ట ను ట్యాంక్ బండ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినందుకు మహ్మద్ గౌస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.