కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామంలో సంబురాలు
10-06-2024 12:23 AM
మహేశ్వరం, జూన్ 9 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో మూడోసారి చోటు దక్కడంతో ఆదివారం ఆయన స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం తిమ్మాపూర్‌లో గ్రామస్తులు సంబురాలు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఎదిగిన తీరును పలువురు పెద్దలు గుర్తుచేసుకున్నారు. కిషన్‌రెడ్డి మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.






