కేంద్ర మంత్రులకు సన్మానం
10-06-2024 12:20 AM
ఢిల్లీకి వెళ్లే ముందు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నేతలు
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ఢిల్లీలో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందు జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌ను తెలంగాణ బీజేపీ నేతలు సన్మానించి అభినందనలు తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, సూర్యనారాయణ తదితరులు కొత్త మంత్రులను అభినందించారు.
రాష్ట్రానికి రెండు మంత్రి పదవులు రావడం వల్ల అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. అంతకుముందు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ ఎమ్మెల్యేలు, అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మను కలిశారు. తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి హేమంతను అధిష్ఠానం దూతగా నియమించిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.






