13 July, 2026 | 3:28 AM

అంబరాన్నంటిన సంబురాలు

10-06-2024 12:30 AM

కరీంనగర్, జూన్ 9: కేంద్ర మంత్రివర్గంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు చోటుదక్కడంతో కరీంనగర్‌లో సంబురాలు అంబరా న్నంటాయి. కార్యకర్తలు, నాయకులతోపాటు బండి కుటుంబ సభ్యులు కూడా సంబురాల్లో మునిగితేలారు. ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని జ్యోతినగర్‌లో బండి సంజయ్ ఇంటి వద్ద కుటుంబ సభ్యులు నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచారు. డోలు వాయిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. బండి సంజయ్ తల్లితోపాటు ఆయన సతీమణి, సోదరులు, కుమారులు, బంధువులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. రాత్రి 9 గంటలకు తెలంగాణ చౌక్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు.