calender_icon.png 28 October, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెస్ క్లబ్ లో కేక్ కట్ చేసి సంబురాలు

28-10-2025 08:20:21 AM

స్వీట్లు పంచిపెట్టిన TUWJ(IJU)నాయకులు

మహబూబ్ నగర్ టౌన్ : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎలక్షన్(Hyderabad Press Club Election)లో మన యూనియన్ మద్దతుతో  అధ్యక్షులుగా శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి,  వైస్ ప్రెసిడెంట్ గా  ఏ.రాజేష్  విజయం సాధించడం పై మహబూబ్ నగర్ యూనియన్ నేతలు ప్రెస్ క్లబ్(Mahabubnagar Press Club) లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. TUWJ(IJU)యూనియన్ మద్దతుతో ఫ్రెండ్స్ ప్యానెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రేస్ క్లబ్ లో పెద్ద ఎత్తున ప్యానెల్  గెలుపొందడం హర్షనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చంద్ర శేఖర్ గౌడ్, సతీష్ రెడ్డి, కాటం నాగరాజు గౌడ్ మాట్లాడుతు రానున్న రోజుల్లో మహబూబ్ నగర్  లో ప్రెస్ క్లబ్ ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి,సభ్యుల అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు TUWJ(IJU) పని చేస్తుందని వారు అన్నారు. జర్నలిస్ట్ సమస్యల పట్ల TUWJ(IJU) రాష్ర్ట అద్యక్షుడు విరాహత్ అలీ,స్టేట్ సేక్రటరీ మదు గౌడ్ అద్యక్షతన అలుపుఎరగని పోరాటం సాగిస్తుందని అన్నారు. జర్నలిస్ట్ ల‌ సక్షేమం పట్ల TUWJ (IJU)  చిత్త శుద్దితో పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కా వెంకట రమణ, శ్రీనివాస్, మేహరాజ్, విజయ్ కుమార్, గోకులం వెంకటేష్.అనిల్,శ్రీకాంత్,శివ,పాల్గోన్నారు.