28-10-2025 01:41:13 AM
టికెట్ ధరల పెంపుతో బాంబు పేల్చనున్న రాష్ట్ర ప్రభుత్వం!
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు చేసింది. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగానే మిగులు బడ్జె ట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆరోపించింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిపాలన.. తీసుకుంటున్న నిర్ణయాలు అటు రాజకీయ విశ్లేషకుల నుంచి, ఇటు ప్రజల నుంచి విమర్శలకు తావిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ధోరణి ఆర్థిక నియంత్రణ లేమి, రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు అద్దం పడుతుంది. ఈ దిశగా హైదరాబాద్ మెట్రో రైల్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి వరకు లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) ఆధ్వర్యంలో కొనసాగిన మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
దీంతో రాష్ట్ర ప్రజలపై సుమారు రూ. 30 వేల కోట్ల అప్పుల భారాన్ని మోపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మెట్రో రైల్ స్వాధీనం చేసుకోవడంతో పరోక్షంగా ప్రజలపై వేల కోట్ల అప్పుల భారాన్ని మోపిన ప్రభుత్వం త్వరలోనే ప్రత్యక్షంగా ప్రజల జేబులు గుల్ల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బస్సు ఛార్జీలు పెంచిన రేవంత్‌రెడ్డి సర్కార్, ప్రస్తు తం అనివార్యంగా మెట్రో టికెట్ ఛార్జీలను పెంచనున్నట్టు అధికార వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి.
విజయక్రాంతి హెచ్చరికలు..
2017లో పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఆపరేషన్లు చేపట్టింది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసి, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం పట్ల అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదొక ‘బ్యాక్‌డోర్ డీల్’ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మెట్రో రైల్ నుంచి ఎల్ అండ్ టీ సంస్థను తప్పించడం ద్వారా ప్రజలపై వేల కోట్ల భారం తప్పదని విజయక్రాంతి పత్రిక ఇప్పటికే హెచ్చరికలు చేసింది.
ప్రభుత్వం మొత్తం ప్రాజెక్ట్‌ను స్వాధీనం చేసుకుంటే భయంకర నష్టాలు తప్పవని, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఒక వారం ముందే సూచించింది. కానీ ఆ హెచ్చరికలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఎల్ అండ్ టీ భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ పెనాల్టీ లేకుండా ఒప్పందాన్ని ముందుగానే ముగించుకోవడమంటే కార్పొరేట్ సంస్థకు నష్టం రాకుండా ప్రభుత్వమే కాపాడిందని విజయక్రాంతి విమర్శించింది. ప్రజల సొమ్ముతో ప్రైవేట్ సంస్థలను కాపాడే కొత్త మోడల్ ఇది అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎందుకీ తొందర..?
సచివాలయ అధికారుల సమాచారం ప్రకారం.. ఎల్ అండ్ టీ లాభాలు కరోనా తర్వాత కూలిపోయాయి. మెట్రో ప్రయాణికుల సంఖ్య కూడా కరోనా పరిస్థితి ముందు కంటే ప్రస్తుతం 30 శాతం తగ్గింది. పైగా కొత్త మార్గాల విస్తరణలో జాప్యం జరగడం, అధిక నిర్వహణ వ్యయాలు ఎల్ అండ్ టీ సంస్థను ఆర్థికంగా భయపెట్టాయి. మెట్రో ప్రాజెక్ట్‌లో ఎల్ అండ్ టీ పెట్టిన రూ. 14,000 కోట్ల ఈక్విటీ జాప్యం, భూసేకరణ వివాదాలు, టికెట్ ధరల పరిమితి కారణంగా క్రమంగా నష్టాలబాట మొదలైంది.
2025 మధ్య నాటికి సంస్థ నష్టాలు భరించలేమంటూ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావ డానికి ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అక్టోబర్ 18న కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా ఆస్తిని ప్రజలకే తిరిగి ఇవ్వడమంటూ ప్రాజెక్ట్ స్వాధీనం చేసుకుంది. కానీ ఒప్పందంలోని షరతులు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఎల్ అండ్ టీ లాభాలను తిరిగి వసూళ్లు, పనితీరు లోపాలపై జరిమానా వంటి అంశాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.
దీంతో ఎల్ అండ్ టీ సంస్థ పెద్దగా నష్టమేమీ లేకుండా, పరిహారం కూడా తీసుకుని ప్రాజెక్టు నుంచి వైదొలగింది. ప్రభుత్వం మాత్రం మొత్తం నష్టాన్ని భరించేందుకు అంగీకరించింది. ఇది ప్రైవేట్ సంస్థల లాభాలకు ప్రజల డబ్బుతో రక్షణ కల్పించడమేనని, ఇది ఆ సంస్థకు ప్రభుత్వమే ఇచ్చిన గోల్డెన్ ఎగ్జిట్ అని విశ్లేషకులు చెబుతున్నారు.
మెట్రో నష్టం.. ప్రజలపై భారం...
రవాణా శాఖ అధికారుల సమాచారం ప్రకారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ప్రజలకు ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రూ.10-60 మ ధ్య ఉన్న మెట్రో ఛార్జీలు డిసెంబర్ నాటికి 50- 100 శాతం పెరగవచ్చని సమాచారం. దీం తో 10 కిలోమీటర్ల ప్రయాణం ఇప్పటి రూ. 40 నుంచి నేరుగా రూ. 80కు ఎగబాకే అవకాశం ఉంది. మెట్రోలో రోజూ ప్రయాణించే 5 లక్షల ప్రయాణికులకు ఇది పెద్ద దెబ్బగా మారుతుంది.
రోజువారీ కూలీలు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులందరూ ఈ భా రాన్ని మోయాల్సిందే. ‘ద్రవ్యోల్బణం పేరిట సెప్టెంబర్‌లో ఇప్పటికే బస్సు ఛార్జీలు 25 శాతం పెం చారు. ఇప్పుడు మెట్రో కూడా పెంచితే మే మేం చేయాల’ని ఒక ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ధనవం తుల రక్షణ కో సం పేదల జేబులు కొల్లగొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. 2023లో ఎన్నికల సమయంలో ‘ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యం..
అని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే ప్రజలపై మెట్రో అప్పుల భారం మోపుతున్నారని విమర్శకులు చెబుతున్నారు. 69 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్--1, ట్రాఫిక్ జామ్‌లతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరానికి ఊపిరి అందిం చాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. కానీ ఎల్ అండ్ టీ నిర్వహణలో అది ‘నష్టాల కేంద్రం’గా మారింది.
కేసీఆర్ హయాం లో భూ స్కాంలు, కరోనా సమయంలో పనులు ఆగిపోవడంతో రూ.14,000 కోట్లు గా ప్రారంభమైన ప్రాజెక్ట్ వ్యయం, క్రమంగా రూ. 18,000 కోట్లకు ఎగబాకింది. పీపీపీ మోడల్‌ను ‘ఇన్నోవేటివ్ సొల్యూషన్’గా మొ దట్లో కొనియాడినప్పటికీ వాస్తవానికి అదే ఈ ప్రాజెక్ట్‌ను కుదేలుచేసింది. ఎల్ అండ్ టీకి ఆదాయంలో 90 శాతం వాటా ఇస్తూ ‘బ్రేక్ ఈవెన్’ అయిన తర్వాత 70-30 నిష్పత్తిలో వాటా అనే షరతు పెట్టారు. కానీ ఆ బ్రే క్ ఈవెన్ అసలు రాలేదు.
ఎల్ అండ్ టీ అప్పు కూడా ప్రభుత్వం పైనే..
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టంగా మారబోతోందని నిపుణుల హెచ్చరిస్తున్నారు. ఈ టేకోవర్ ద్వారా ఎల్ అండ్ టీ సంస్థ నష్టాలను ప్రభుత్వం భరిస్తోంది. అయితే దీని ద్వారా రూ. 55 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా కాగా, అదనంగా ఎల్ అండ్ టీ తీసుకున్న రూ. 13,000 కోట్ల రుణభారం కూడా ఇప్పుడు రాష్ర్ట ప్రభుత్వ భుజాలపై పడనుంది.
దీనికి తోడు ఒప్పందం ముందుగానే రద్దు చేసుకున్నందుకుగాను ఎల్ అండ్ టీ సంస్థకు ప్రభుత్వం మరో రూ. 2,000 కోట్లు పరిహారంగా చెల్లించనుంది. మొత్తం మీద, మొదటి దశలోనే రూ. 70 వేల కోట్లకు పైగా భారమని అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ ఈ నష్టం ఇంతటితో ఆగదని, ప్రాజెక్ట్ నిర్వహణ, సంరక్షణ, వడ్డీ చెల్లింపులు, ఖర్చులు కలిపి రాబోయే 40 ఏళ్లలో అదనంగా మరో రూ. 50 వేల కోట్లకు పైగా భారమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని ఒక తరం ప్రజలపై నెమ్మదిగా అమలయ్యే ఆర్థిక దోపిడీగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు.
ప్రభుత్వానికైతే 11 శాతం వడ్డీ..
మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం ద్వారా ఎదురయ్యే ఆర్థిక ప్రతికూలతలు తక్షణమే కనిపిస్తున్నాయి. మెట్రో రైళ్లు కొనసాగించడమే కాకుండా, ఓల్డ్ సిటీ, శంషాబాద్ వరకు ఫేజ్--2 విస్తరణకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వం 2026 నాటికి మరో రూ. 15,000 కోట్లు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. ఎల్ అండ్ టీ తన ఏఏఏ క్రెడిట్ రేటింగ్, బ్రాండ్ వాల్యూతో కేవలం 6.5 శాతం వడ్డీతోనే రుణాలు పొందేది.
కానీ ఇప్పటికే రూ. 3 లక్షల కోట్లకు చేరుకున్న రాష్ర్ట అప్పులు కారణంగా బ్యాంకులు ఇప్పుడు 11 శాతం వడ్డీని ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నాయి. వడ్డీ రేటులో ఉన్న 4.5 శాతం తేడాతో ప్రతి ఏడాది రాష్ట్ర ఖజానా నుంచి రూ. 700 కోట్లు అదనపు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే లోపాలున్నప్పటికీ ఎల్ అండ్ టీ సంస్థలో మెట్రో రైల్ నిర్వహణ వ్యవస్థను సాంకేతికత ఆధారంగా, క్రమపద్దతిలో, తక్కువ సిబ్బందితో నడిచేది.
కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో పాలన ఆలస్యం, అధికారుల జోక్యం వంటి అంశాలు నిర్వహణను మరింత కష్టతరం చేస్తాయని నిపుణుల అంచనా వేస్తున్నారు. ప్రాథమిక ఆడిట్ నివేదికల ప్రకారం.. ప్రభుత్వ నిర్వహణలో 20-25 శాతం అదనంగా నిర్వహణ నష్టం వాటిల్లుతుందని స్పష్టమవుతున్నది. అంటే ప్రతి ఏడాది రూ. 1,500 కోట్ల నష్టం వస్తుంది. కానీ మెట్రో ఆదాయం మాత్రం రూ. 800 కోట్ల వద్దే స్థిరంగా ఉంది.
ఎన్నికల వ్యూహం..
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నవంబర్ 2025లో జరగనున్న తరుణం లో ఈ టేకోవర్ ప్రకటించడం రాజకీయంగా పెద్ద వ్యూహం అని విశ్లేష కులు అంటున్నారు. నాయకత్వం బలంగా ఉందనే మేజెస్ ఇవ్వడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నా రు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లు వేసిన తర్వాత టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. కానీ ఓటర్లు మౌనంగా లేరు. సోషల్ మీ డియా అంతా మెట్రోస్కామ్ హ్యాష్‌ట్యాగ్‌లతో వైరల్ అవుతున్నది.
ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ర్టంలో ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ సమస్య కాదని, ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికల వైఫల్యానికి ప్రతీక అని నిపుణులు అభిప్రా యపడుతున్నారు. ఇప్పటికే రాష్ర్ట అప్పు-జీఎస్‌డీపీ నిష్పత్తి 35 శాతం దాటే దశలో ఉంది. ఈ టేకోవర్ తరువాత ఆ నిష్పత్తి మరింత పెరుగుతుంది. సామాజిక సంక్షేమ పథ కాలకు కేటాయింపులు తగ్గిపోవడం, మెట్రోవిస్తరణ కలలు వాయిదా పడడం తప్పదని హెచ్చరిస్తున్నారు.
మెట్రో ప్రాజెక్టు కింద ఇప్పుడున్న ఆస్తులు ఏమౌతాయోనన్న ఆందోళన కూడా నగరవాసుల్లో వ్యక్తమవు తున్నది. కానీ మరోవైపు ఎల్‌అండ్ టీ మాత్రం లాభపడింది. మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రకటన వెలువడగానే ఎల్‌అండ్‌టీ కంపెనీ షేర్ విలు వ 2 శాతం పెరిగింది. దీనిని క్లీన్ ఎగ్జిట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మెట్రో నష్టం.. ప్రజలపై భారం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ప్రజలకు ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రూ. 10-60 మధ్య ఉన్న మెట్రో ఛార్జీలు డిసెంబర్ నాటికి 50-100 శాతం పెరగవచ్చని సమాచారం. దీంతో 10 కిలోమీటర్ల ప్రయాణం ఇప్పటి రూ. 40 నుంచి నేరుగా రూ. 80కు ఎగబాకే అవకాశం ఉంది. మెట్రోలో రోజూ ప్రయాణించే 5 లక్షల ప్రయాణికులకు ఇది పెద్ద దెబ్బగా మారుతుంది. రోజువారీ కూలీలు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులందరూ ఈ భారాన్ని మోయాల్సిందే.
‘ద్రవ్యోల్బణం పేరిట, సెప్టెంబర్‌లో ఇప్పటికే బస్సు ఛార్జీలు 25 శాతం పెంచారు. ఇప్పుడు మెట్రో కూడా పెంచితే మేమేం చేయాల’ని ఒక ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ధనవంతుల రక్షణ కోసం పేదల జేబులు కొల్లగొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2023లో ఎన్నికల సమయంలో ‘ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యం.. అని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే ప్రజలపై మెట్రో అప్పుల భారం మోపుతున్నారని విమర్శకులు అంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నవంబర్ 2025లో జరగనున్న తరుణంలో ప్రభుత్వం మెట్రో టేకోవర్ ప్రకటించడం రాజకీయంగా పెద్ద వ్యూహం అని విశ్లేషకులు అంటున్నారు.