04-08-2025 03:09:59 PM
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: కాళ్లేశ్వరం ప్రాజెక్టు అప్పులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచన జారీ చేసింది. ప్రాజెక్టును మేడిగడ్డ బ్యారేజీ స్తంభాలు కూలిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నిర్మాణ లోపాలు, కాళ్లేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన వియషయం తెలిసిందే. అయితే కాళ్లేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశం పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కాళేశ్వరం ఖాతాను స్టాండర్ట్ నుంచి సబ్ స్టాండర్డ్ కు చేయొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీ చామల ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చినట్లు సమాచారం. కాళేశ్వరం రుణాల పునఃవ్యవస్థీకరణ కోసం తెలంగాణ విజ్ఞాప్తి చేసేందని, దీంతో ప్రాజెక్టు పూర్తికాగానే రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపును పరిశీలిస్తామని కేంద్రం వెల్లడించింది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (Kaleshwaram Lift Irrigation Scheme) ప్రణాళిక, అమలు, పూర్తి, ఆపరేషన్ మరియు నిర్వహణ (operation and maintenance)లో జరిగిన అవకతవకలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా జవాబుదారీగా ఉన్నారని పీసీ ఘోష్ విచారణ కమిషన్ సమర్పించిన నివేదిక పేర్కొంది. ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం... ఈ ప్రాజెక్టును కేబినెట్ ఆమోదం లేకుండా చేపట్టారని, అప్పటి నీటిపారుదల మంత్రి టి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లపై బాధ్యతను నిర్ణయించారని కమిషన్ నివేదించింది. కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించినందుకు, తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినందుకు ఆరుగురు నీటిపారుదల ఇంజనీర్లపై కఠినమైన చట్టపరమైన చర్య తీసుకోవాలని కూడా ఇది సిఫార్సు చేసింది. ఇటీవల ఏసీబీకి పట్టుబడిన అప్పటి ఇంజనీర్-ఇన్-చీఫ్ సి మురళీధర్ రావు కేంద్ర జల సంఘానికి వాస్తవాలను తప్పుగా అందించారని నివేదిక పేర్కొంది.