04-08-2025 05:40:06 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి(District Collector Manu Choudary)ని ఉప్పు జశ్వంత్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రగతినగర్ సమస్యలైన స్మశానవాటిక, అంబీర్ సరస్సు ఆక్రమణలు, దోమల సమస్య, ట్రాఫిక్ సమస్యల గురించి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తన బృందానికి తెలియజేశారు. అంబిర్ సరస్సు దగ్గర స్మశానవాటికకు భూమిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాచుపల్లి తహశీల్దార్ అవసరమైన చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ కి నివేదిక పంపాలని నోటీసు పంపారు. ఈ కార్యక్రమంలో శేషసాయి తదితరులు పాల్గొన్నారు.