04-08-2025 05:22:49 PM
హైదరాబాద్: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి ఎండతో ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఒకసారిగా చల్లబడి వర్షం దంచికొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, మధురానగర్, బోరబండ, యూసఫ్ గూడ, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, మెహదీపట్నం, లంగర్ హౌస్, కార్వాన్, గోల్కొండ, జియాగూడ, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్ధుల్లాపూర్ మెట్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, మీర్పేట్, ఉప్పల్, రామాంతపూర్, నాచారం, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మాదాపూర్, కూకట్పల్లి, హైదర్ నగర్, వివేకానందనగర్, హిమాయత్ నగర్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, కాప్రా, తార్నాకలో భారీ వర్షం కురిస్తోంది.
షేక్‌పేట్‌లో అత్యధికంగా 7.4 సెం.మీ, ఆసిఫ్‌నగర్‌లో 5.3, ఖైరతాబాద్‌లో 5 సెం.మీ వర్షపాతం నమోదైందని, రాబోయే రెండు గంటల్లో తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.