calender_icon.png 4 August, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

విధులపట్ల నిర్లక్ష్యం..

04-08-2025 05:50:14 PM

హన్మకొండ/కెయు క్యాంపస్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా(Hanumakonda District) విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఉద్యోగులు విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తూ విధులకు డుమ్మా కొట్టిన దృశ్యం కనిపించింది. సోమవారం విజయక్రాంతి ప్రతినిధులు కార్యాలయానికి వెళ్లగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. హన్మకొండ విద్యాశాఖ కార్యాలయంలో గత కొంత కాలంగా హాజరు పట్టికలో సంతకం చేస్తూ తమ సొంత పనులపట్ల ఆసక్తి చూపుతున్నారని విమర్శలున్నాయి. జిల్ల కార్యాలయంలోనే కాకుండ కొన్ని మండల కేంద్రాల్లో కూడా ఉపాధ్య సంఘాలుగా పేర్లు చెపుతూ తమ స్వంత పనులు చేసుకుంటున్నారని సమాచారం. జిల్లా కేంద్రంలో ఆదర్శంగా ఉంటూ విధులు నిర్వహించాల్సిన ఉద్యోగులు, నిర్లక్ష్యం వహించడం వల్ల మండల కేంద్రల్లో పనిచేస్తున్న వారు కూడా వీరి బాటలోనే ప్రయాణిస్తూన్నారు. ఇప్పటికైన విద్యాశాఖ అధికారి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరుతున్నారు.