04-08-2025 05:35:40 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం(Bellampalli Mandal)లో తాండవిస్తున్న ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పొట్లపల్లి సుభాష్ రావు ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండలానికి సంబంధించిన మాజీ సర్పంచులు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలోని గ్రామపంచాయతీ లలో పారిశుద్ధ్య పనులు అమలు చేయడం లేదని, మంచినీటి పైప్ లైన్లు లీకేజీలు అవుతున్నాయని, గ్రామ ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. గ్రామాలలో వీధి దీపాలను అమర్చడం లేదని, ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడం లేదని వారు పేర్కొన్నారు. విచ్చలవిడిగా తిరుగుతున్న పిచ్చికుక్కలను నివారించడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. అధికారులకు వినతిపత్రం అందించిన వారిలో మాజీ సర్పంచులు తాళ్లపల్లి అశోక్ గౌడ్, కారుకూరి వెంకటేష్, నాయకులు సింగం గణేష్ గౌడ్, గాజుల వెంకటేష్ గౌడ్, జిల్లపల్లి వెంకటస్వామి, కోట అశోక్, వెంబడి చిరంజీవి, యాటకార్ల తిరుపతి లు పాల్గొన్నారు.