calender_icon.png 4 August, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

04-08-2025 05:57:54 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

కరీంనగర్ (విజయక్రాంతి): జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) కోరారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడుతూ, ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లా విద్యాధికారి, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా వైద్యాధికారి, ఇంటర్మీడియట్ అధికారి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఇచ్చిన టార్గెట్ ని పూర్తి చేయాలని అన్నారు.

ప్రజావాణికి 290 దరఖాస్తులు

కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి 290 దరఖాస్తులు వచ్చాయి. అర్జీదారుల నుండి దరఖాస్తుల స్వీకరించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వాటి పరిష్కారం కోసం జిల్లా అధికారులకు బదిలీ చేశారు. 

విద్యార్థుల ఆర్ట్ క్రాఫ్ట్ మేళా సందర్శన 

జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తయారుచేసిన క్రాఫ్ట్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అన్నారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన రాఖీలను కలెక్టర్ కు కట్టారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ పాల్గొన్నారు.