calender_icon.png 4 August, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బుగ్గ రాజేశ్వరునికి ఘనమైన మొక్కులు

04-08-2025 05:33:38 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని సోమవారం బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం(Bugga Rajarajeshwara Swamy Temple)లో భక్తులు ఘనమైన ముక్కులను చెల్లించుకున్నారు. తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరునికి భక్తితో బోనాలు సమర్పించుకున్నారు. మనసు నిండా మొక్కితే కోరిన కోరికలు తీర్చే రాజరాజేశ్వరున్ని దర్శించుకుని అభిషేకాలు చేశారు. శ్రావణమాసం పూజలలో భాగంగా హనుమాన్ దేవాలయంతో పాటు నాగులమ్మ గుడిలోనూ మహిళలు పూజలు చేశారు. ఆలయ అర్చకులు శ్రీరాంభట్ల వేణుగోపాల శాస్త్రి, సతీష్ శర్మల నేతృత్వంలో శివాలయం గర్భగుడిలో శివలింగానికి వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చనలు, అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. నియోజకవర్గంలోని బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, రెబ్బెన, ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు.

మహా అన్నదానం నిర్వహించిన ఆలయ ఉద్యోగి

సోమవారం బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించుకున్న భక్తుల కోసం ఆలయ ఉద్యోగి భాను దంపతులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో బుగ్గ రాజేశ్వర అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, ఆలయ ఈవో బాపిరెడ్డి, కన్నాల మాజీ సర్పంచ్ జిల్లపల్లి స్వరూప, అన్నదాన ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.