calender_icon.png 4 August, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియా ద్వారా రైతులకు అధిక లాభాలు

04-08-2025 05:53:37 PM

హుజురాబాద్ ఏడిఏ సునీత..

హుజురాబాద్ (విజయక్రాంతి): నానో యూరియా ద్వారా రైతులకు అధిక దిగుబడి రావడం వల్ల రైతులకు లాభం జరుగుతుందని హుజురాబాద్ ఏడిఏ సునీత(ADA Sunitha) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని కనుకుల గిద్ద గ్రామంలో ఐఎఫ్ఎస్సి కోడ్ కంపెనీ వారు నానో యూరియా, క్రిమి సంహారక మందులు డ్రోన్ ద్వారా స్ప్రే చేసే డెమోను సోమవారం రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నానో యూరియా వల్ల అధిక లాభాలు ఉన్నాయని సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి తెలియజేశారు. నానో యూరియా వాడితే ద్రవ రూపంలో ఉండే ఎరువు చాలా తక్కువ మోతాదులో వాడిన కూడా మొక్కలకు అవసరమైన పోషకాలను అందిస్తుందన్నారు. సాంప్రదాయ యూరియా(గ్రాండ్యులర్ యూరియా తో పోలిస్తే నానో యూరియాతో అనేక లాభాలు ఉన్నాయన్నారు.

నానో యురియాను ఆకులపై పిచ్చికారి చేయడం వల్ల మొక్కలు పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహిస్తాయి అన్నారు. దీనివల్ల పంట దిగుబడి 8% శాతం వరకు పెరుగుతుందని రైతులకు సూచించారు. సంప్రదాయ యూరియాలో దాదాపు 30 నుండి 50% నత్రజని నెలలో నుంచి ఆవిరై పోతుందన్నారు. నానో యూరియా నేరుగా మొక్కల ఆకుల ద్వారా తీసుకోబడుతుందని దీనివల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు అన్నారు. తక్కువ పరిమాణంలో అవసరం ఉంటుంది కాబట్టి రైతులకురవాణా ఖర్చులు ఆదావుతాయని సూచించారు. సాంప్రదాయ యూరియా వాడకాన్ని  తగ్గించడానికి, పూర్తిగా నివారించడానికి అనేక ప్రత్యామ్యాలు ఉన్నాయన్నారు. రైతులు నానో యూరియానే వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ బాలాజీ, హుజరాబాద్ మండల వ్యవసాయ అధికారి భూమి రెడ్డి, విస్తరణ అధికారిని అనూష, చిన్మయి, పరమేశ్వర్ తో పాటు రైతులు పాల్గొన్నారు.