calender_icon.png 4 August, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

దాసారం బస్తీలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి తలసాని

04-08-2025 05:43:25 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) మృతుల కుటుంబాలను పరామర్శించి సంతాపం, సానుభూతి తెలిపారు. సనత్ నగర్ లోని దాసారం బస్తీ మాజీ అధ్యక్షుడు యాదగిరి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కుమార్ సోదరుడు సతీష్ లు ఆదివారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం వారి నివాసాలకు వెళ్ళి పార్ధీవదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే వెంట అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, కట్ట బలరాం, వనం శ్రీనివాస్, కొలన్ భూపాల్ రెడ్డి, ఆకుల రాజు తదితరులు ఉన్నారు.