calender_icon.png 7 July, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణపై కేంద్రం వివక్ష

03-07-2025 12:31:39 AM

సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : తెలంగాణ రైతుల విషయంలో కేంద్ర ప్రభు త్వం వివక్షను కొనసాగిస్తోందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి పేరుకే కేటాయింపులు జరగుతున్నాయని, సగమే సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు.

బుధవారం సీడ్ కార్పొ రేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేవలం 3.06 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా అయ్యాయని.. ఇంకా రాష్ట్రంలో 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉందన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉన్నా దండగేనని ఆరోపించారు. బీజేపీ నాయకుల వైఖరి చూస్తుంటే రైతాంగాన్ని, వ్యవసాయాన్ని విధ్వంసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హం దాన్, రైతు సంఘం నాయకులు  వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.