calender_icon.png 7 July, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుపూర్ణిమ వేడుకలను జయప్రదం చేయండి

07-07-2025 05:48:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయిబాబా ఆలయంలో నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలకు దేవాదాయ ధర్మదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ గంగోని భూరజ్, కార్యనిర్వాహణ అధికారి రమేష్ తెలిపారు. సోమవారం ఆలయంలో వేడుకల ఆహ్వాన పత్రాలు ఆవిష్కరించారు. ఈనెల 8వ తేదీన గురు పౌర్ణమి ఉత్సవాలు, అఖండ సాయి నామం భజన ప్రారంభమవుతుందని 9వ తేదీ మంగళ స్నానం, అర్చన, 10వ తేదీ పౌర్ణమి రోజున బాబా విగ్రహానికి అభిషేకాలు తదితర కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు మహ అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా కృపకు పాత్రులు కావాలని కోరారు.