calender_icon.png 8 July, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా చేతిలో తొత్తుగా మారిన మోదీ

03-07-2025 12:33:37 AM

- 140 కోట్ల ప్రజల ప్రయోజనాలను ట్రంప్ కు తాకట్టు పెట్టిన మోడీ విధానాలపై పోరాడుదాం

- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అమెరికా కాన్సులేట్ ముట్టడి, భగ్నం

- నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

-ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర

ముషీరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): 140 కోట్ల ప్రజల ప్రయోజనాలను ట్రంప్ కు తాకట్టు పెట్టిన మోడీ విధానాలు నశించాలని, అమెరికా చేతిలో తొత్తుగా మారిన  నరేంద్ర మోదీ అని, భారతీయులపై అమెరికా దుర్మార్గ చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యం లో ఛలో అమెరికా రాయబార కార్యాలయ (అమెరికన్ కాన్సులేట్) ముట్టడి కార్యక్రమానికి హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి ర్యాలీగా వెళ్లిన నేతలను, ర్యాలీని అడ్డుకుని తోపులాటలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మోడీ, ట్రంప్ వేషధారణలతో నల్ల చొక్కాలను ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేం ద్రలు మాట్లాడుతూ దివాళా కోరు ఉగ్రవాద ప్రేరేపిత దేశం పాకిస్తాన్ కు అమెరికా రెడ్ కార్పెట్ వేస్తూ తన సామ్రాజ్యవాద విష పోకడలను అనుసరిస్తుందని ధ్వజమెత్తారు. ఔర్ ఏక్ బార్ ట్రంప్ సర్కార్ అంటూ అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మోడీ ట్రంప్ గెలుపు కోసం భారతీయులతో మీటింగ్ ఏర్పాటు చేసి ట్రంప్ ను గెలిపించాలని మోడీ కోరడం సిగ్గు చేటు అన్నారు.

అనంతరం ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ భారతీయులపై తన కర్కషాన్ని ప్రదర్శించాడ న్నారు. ఇటీవల కాలంలో జరిగిన భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ నిసిగ్గుగా మీడియాకు చెప్పినా, మోడీ ఖండించ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బిజ్జ శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సల్మాన్ బేగ్, ఎండీ. కుతుబ్, రాష్ట్ర సమితి సభ్యులు మాజీద్ అలీ ఖాన్,శేఖర్, కళ్యాణ్, నాగరాజు, మోసిన్ ఖాన్, మధుకర్, మధు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.