07-07-2025 05:50:40 PM
నిర్మల్ (విజయక్రాంతి): కార్మికులకు పని గంటల భారాన్ని తగ్గించాలని, వేతనాలు పెంచాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాజన్న(IFTU District Secretary Rajanna) డిమాండ్ చేశారు. సోమవారం కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి ఈ నెల 9న నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు భద్రత లేబర్ కోడ్ చట్టాల రద్దు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె నిర్వహిస్తున్నామని ఇందులో అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీ గంగన్న ఘపూర్ సుజాత లలిత ప్రజలు పాల్గొన్నారు.