07-07-2025 06:01:42 PM
టేకుమట్ల వ్యవసాయ అధికారి ఎమ్.కళ్యాణి..
టేకుమట్ల/చిట్యాల (విజయక్రాంతి): రైతులు మోతాదుకు మించి ఎరువులను వాడొద్దని వ్యవసాయ అధికారి ఎమ్.కళ్యాణి(Agriculture Officer M. Kalyani) సూచించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి, వెలిశాల గ్రామాల్లోని పత్తి, వరి నారులను వ్యవసాయ విస్తారణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రైతులు పంట చేనులలో యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా ఉపయోగించాలని సూచించారు. అందువల్ల నైట్రోజన్ వినియోగం పెరుగుతుందని పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడి సాధ్యమవుతుందని తెలిపారు. పత్తి పంటకు మొదటి దఫాలో 25 కిలోలు మాత్రమే వాడాలని సూచించారు. మొక్కలకు దగ్గర్లో ఎరువులను వేయడంతో పాటు మట్టిని కప్పివేయాలని తెలిపారు. ఆమె వెంట వ్యవసాయ విస్తరణ అధికారులు ఎమ్ రాహుల్, అరుణ్ రైతులు ఉన్నారు.